Wednesday, January 8, 2025

నాలుగేళ్లలో 3సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ముఖ్యమంత్రి షిండే మంత్రివర్గంలోకి అజిత్‌పవార్ చేరారు. అజిత్‌ పవార్ ఆదివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఛగన్ భుజ్‌బల్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రులుగా అజిత్‌ గ్రూప్‌లోని 9 మంది ఎమ్మెల్యేల ప్రమాణం చేశారు. ఎన్సీపీకి పార్టీలో 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో అజిత్‌పవార్ వెంట మెజారిటీ మంది ఎమ్మెల్యేలు వెళ్లారు.

నాలుగేళ్లలో 3సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్‌పవార్ ప్రమాణం చేశారు. మూడు సీఎంల దగ్గర డిప్యూటీ సీఎంగా అజిత్ పనిచేశారు. సాగునీటి, కో ఆపరేటివ్ స్కామ్‌లలో అజిత్‌పై బీజేపీ ఆరోపణలు ఉన్నాయి. 2014, 2019లో అజిత్‌ను టార్గెట్ చేసిన బీజేపీ.. ఇప్పుడదే బీజేపీ అలయన్స్‌లో డిప్యూటీ సీఎంగా అజిత్ బాధ్యతలు అప్పగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News