Friday, December 20, 2024

అజిత్ పవార్ కాన్వాయ్‌పై ఉల్లిపాయలు, టమోటాలతో దాడి

- Advertisement -
- Advertisement -

నాసిక్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కారును, కాన్వాయ్‌ను అడ్డగించేందుకు కోపోద్రిక్తులైన రైతులు శనివారం ఉదయం ఉల్లిగడ్డలు, టమాటాలతో దాడి చేశారు. అజిత్ పవార్ ఓఝర్ విమానాశ్రయం నుండి దిండోరీకి వెళుతుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కోపోద్రిక్తులైన రైతులు అతని వాహనాలను అడ్డుకున్నారు. ఉల్లిపాయలు, టమోటాలతో కార్లను లక్ష్యంగా చేసుకున్నారు. రైతులు విఐపి కాన్వాయ్‌కు నల్లజెండాలు చేతబూని, ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకోవాలని, సాగుదారులకు సరైన జీవనోపాధి కల్పించేలా టమోటాలకు మంచి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

“ప్రభుత్వ విధానాలను మేము ఖండిస్తున్నాము… రైతులు చనిపోతున్నారు… ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని ఉపసంహరించుకోవాలని, టమోటాలకు తగిన కనీస మద్దతు ధరను మేము కోరుకుంటున్నాము” అని నిరసనకారులలో ఒకరు అక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. సమీపంలోని కల్వాన్ నుండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరసనకారులను తొలగించారు.

మే-ఆగస్టు మధ్య టమాటా ధరలు రూ.200కి చేరిన తర్వాత, ప్రస్తుతం మార్కెట్‌ను బట్టి రిటైల్ ధరలు కిలోకు రూ.12-18 మధ్య ఉండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా, నాసిక్‌లోని ఉల్లి రైతులు టోకు వ్యాపారాన్ని నిలిపివేసి 13 రోజుల సమ్మెకు దిగారు. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అక్టోబర్ 3న సమ్మె విరమించినప్పటికీ హోల్‌సేల్ వ్యాపారులు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఒక నెల అల్టిమేటం ఇచ్చారు, లేని పక్షంలో మళ్లీ సమ్మె చేస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News