Monday, January 13, 2025

బిజెపివైపు లాగుతున్నారు..వెళ్లేదే లే

- Advertisement -
- Advertisement -

ముంబై : తన శ్రేయోభిలాషులు కొందరు తనను బిజెపితో స్నేహానికి ఒత్తిడి తెస్తున్నారని ఎన్‌సిపి నేత శరద్ పవార్ తెలిపారు. అయితే వారి ప్రయత్నం వారిది, కానీ బిజెపి వైపు తాను వెళ్లేది లేదని పవార్ స్పష్టం చేశారు. ఎన్‌సిపి విధానాలకు బిజెపికి పొంతనలేదని, ఈ దశలో వారితో పొత్తు పొసగదని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో సంగోలాకు వచ్చిన పవార్ అక్కడ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కలవని దిక్కులను కలిపేందుకు కొందరు యత్నిస్తున్న వార్త నిజమే అన్నారు. ఎన్‌సిపి జాతీయ అధ్యక్షుడి హోదాలో తాను ఒక్క విషయం చెప్పదల్చుకున్నానని, బిజెపితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు.

తమలో కొందరు వేరే మార్గం ఎంచుకున్నారని ఆయన ఈ సందర్భంగా అజిత్ పవార్ బృందం గురించి చెప్పారు.మరికొందరు తన వైఖరిలో మార్పు ఉండాలని ఆశిస్తున్నారని, ఎవరి ధోరణి వారిది అని, అయితే ఎన్‌సిపి వైఖరి మారదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ తనను శనివారం పుణేలో రహస్యంగా కలుసుకున్నారని, ఈ సందర్భంగా కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయని వార్తలు వెలువడ్డాయి. అజిత్ పవార్ ఎవరో కాదు తన సోదరుడి కుమారుడు. ఆయన వచ్చి తనను కలిస్తే తప్పేముంటుంది? కుటుంబంలోని పెద్ద వ్యక్తిని చిన్నవాడు వచ్చి కలిస్తే దీనికి వేరే రంగు అద్దడం భావ్యం కాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News