Monday, November 18, 2024

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి రూ.1000 కోట్ల ఆస్తి జప్తు

- Advertisement -
- Advertisement -

Ajit pawar
ముంబయి: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ. 1000 కోట్ల విలువ చేసే ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసుకుంది. ముంబయిలోని ప్రసిద్ధ నిర్మల్ టవర్ సహా ఐదు ఆస్తులను జప్తు చేసుకుంది. వాటిలో ఓ చక్కెర కర్మాగారం, ఓ రిసార్టు ఉన్నాయి. “అజిత్ పవార్, ఆయన కుటుంబ సభ్యులు బినామీ ఆస్తుల నుంచి ప్రయోజనం పొందుతున్నారు” అని ఆదాయపు పన్ను వర్గాలు పేర్కొన్నాయి. ఆ అక్రమ ఆస్తులపై బినామీ వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. గత నెల పవార్ సోదరీమణుల ఇళ్లు, పొలాలపై ఆదాయపు శోధనలు జరిగాయి.
ఆదాయపు పన్ను శాఖ దాడులపై అజిత్ పవార్ ప్రతిస్పందిస్తూ “నాకు చెందిన ఆస్తులపై నేను రెగ్యులర్‌గా పన్ను చెల్లిస్తున్నాను” అన్నారు. “నేను ఆర్థిక మంత్రి కూడా అయినందున నేను ప్రతి సంవత్సరం పన్ను చెల్లిస్తున్నాను. ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తాను” అన్నారు.
35 నుంచి 40 ఏళ్ల క్రితం పెళ్లయిపోయిన నా సోదరీమణుల గృహాలు, పొలాలపై ఆదాయపు పన్ను దాడులు జరగడం నాకు బాధ కలిగించింది. ఆదాయపు పన్ను సంస్థలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి” అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖీంపూర్ ఘటనపై తాను వ్యాఖ్యలు చేసినందునే బిజెపి ఈ ఆదాయపు పన్ను దాడులు జరిపించిదని ఆయన నిందించారు. ఈ విషయమై మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సైతం బిజెపిని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News