Saturday, November 23, 2024

మూడున్నరేళ్లు.. మూడు సార్లు డిప్యూటీ సిఎం

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ మూడున్నరేళ్లలో మూడు సార్లు డిప్యూటీ సిఎంగా ప్రమాణం చేయడం విశేషం. అయితే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మూడు సార్లూ వేర్వేరు వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉండడం గమనార్హం. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలసమైంది. కొన్ని రోజులకు అజిత్ పవార్‌కు గాలం వేసిన బిజెపి ఆయన వర్గం ఎన్‌సిపి ఎంఎల్‌ఎల మద్దతుతో 2019 నవంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం హడావుడిగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్‌పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే కేవలం రెండు రోజుల్లోనే శరద్‌పవార్ చక్రం తిప్పి అజిత్ పవార్‌ను వెనక్కి రప్పించారు.

దీంతో బిజెపి సర్కార్ కూలిపోయింది.ఆ తర్వాత శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా కూటమి పేరుతో 2019 డిసెంబర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, అజిత్ పవార్ రెండో సారి డిప్యూటీ సిఎంగా ్రప్రమాణం చేశారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే బిజెపి కుట్ర చేసి శివసేన నేత ఏక్‌నాథ్ షిండేకు గాలం వేసింది. దాంతో షిండే ఏకంగా 40 మంది శివసేన ఎంఎల్‌ఎలను చీల్చి శివసేనను దెబ్బకొట్టారు. అందుకు ప్రతిఫలంగా బిజెపి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉపముఖ్యమంత్రిని చేసింది. అజిత్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా బిజెపి మరోసారి అజిత్‌పవార్‌కు గాలం వేసింది.దాంతో ఆయన రెండో సారి పార్టీని చీల్చి ఎన్‌డిఎ సంకీర్ణ సర్కార్‌కు మద్దతు ప్రకటించారు.

దాంతో షిండే ప్రభుత్వం ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసింది. దీంతో అజిత్ పవార్ ముచ్చటగా మూడో సారి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాగా మహారాష్ట్రలో 2019నుంచి నాలుగేళ్లలో నాలుగు సార్లు మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు జరగడం విశేషం. తొలి మూడు ప్రమాణ స్వీకారాలు భగత్ సింగ్ కోశ్యారి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో చోటు చేసుకోగా, తాజాగా రమేశ్ బైస్ గవర్నర్ పదవిలో ఉండగా జరగడం విశేషం. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్‌లో అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొద్ది నెలల తర్వాత జరగాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News