Monday, January 20, 2025

80 ఏండ్లు పైబడ్డా ఎందుకీ జంజాటం..

- Advertisement -
- Advertisement -

ముంబై : కొందరు 80 సంవత్సరాలు మీద పడ్డా రిటైర్ కాకుండా మొండికేస్తారు. వీరితో మహాచిక్కే అని ఎన్‌సిపి నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. దిగ్గజనేత , తన అంకుల్ శరద్ పవార్‌పై ఆదివారం చురకలకు దిగారు. వయస్సు మీద పడినప్పుడు విశ్రాంతి తీసుకోవల్సి ఉంటుంది. , ప్రభుత్వోద్యోగులు 58 పడిలోకి రాగానే రిటైరవుతారు. అత్యధికులు తమ అంతకు ముందటి వృత్తి నుంచి కనీసం 75 ఏండ్ల వయస్సులో అయినా విరమించుకుంటారు. ఇంటిపట్టున ఉంటారు. కానీ ఒకాయన ఇప్పుడు 84 ఏండ్లు మీదపడ్డా ,

రిటైరయ్యేది లేదని భీష్మించుకుంటున్నారని అజిత్ వ్యాఖ్యానించారు. థానేలో ఈ ఎన్‌సిపి చీలిక వర్గపు నేత ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాను ప్రజల కోసం పనిచేసేందుకు ఏదైనా చేస్తానని , ఇదే తనకు ప్రధానం అని తేల్చిచెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం అత్యవసరం , ఇందుకు అధికారం తప్పనిసరి , ఈ రాదారి చేరేందుకు స్పందించాల్సి ఉంటుందన్నారు. పెద్దరికం నిలబెట్టుకోవాలనుకునే వారు గౌరవప్రదంగా సకాలంలో రిటైర్ కావాల్సి ఉంటుంది. లేకపోతే దీనికి వేరే అర్థాలు వస్తాయని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News