Sunday, December 22, 2024

ఆగస్టు పదికల్లా అజిత్ పవార్ సిఎం..

- Advertisement -
- Advertisement -

ముంబై : వచ్చే నెల 10 వ తేదీ నాటికి మహారాష్ట కొత్త ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ వస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత పృధ్వీరాజ్ చవాన్ సోమవారం తెలిపారు. ఎన్‌సిపి నుంచి వీడి అజిత్ పవార్ వర్గం అధికార కూటమిలో చేరింది. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలకమైన ఆర్థిక మంత్రిగా కూడా రంగంలోకి దిగారు. ఇప్పుడున్న సిఎం ఏక్‌నాథ్ షిండే, 15 మంది రెబెల్ శివసేన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయం పదవ తేదీ దరిదాపుల్లో తేలుతుంది. సుప్రీంకోర్టు నుంచి వీరిపై అనర్హత వేటు పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ దశలోనే అజిత్ పవార్‌ను సిఎం చేస్తారని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News