Monday, January 13, 2025

అదే జరిగితే మేము తప్పుకుంటాం: ఏక్‌నాథ్ షిండే వర్గం

- Advertisement -
- Advertisement -

 

ముంబై: ఎన్‌సిపి ఎమ్మెల్యే అజిత్ పవార్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపితో చేతులు కలిపితే మహారాష్ట్రలో ప్రభుత్వం నుంచి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన తుప్పుకుంటుందని శివసేన(ఏక్‌నాథ్ షిండే) ప్రతినిధి సంజయ్ షిర్సట్ ప్రకటించారు. బిజెపితో కలసి మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకుంటున్న శివసేన(షిండే వర్గం) అధికార ప్రతినిధి షిర్సట్ మంగళవారం ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌సిపి నేరుగా బిజెపితో చేతులు కలుపుతుందని తాము భావించడం లేదని చెప్పారు. ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు.

Also Read: విద్యార్థులతో లైంగిక చర్యలు.. ఆరుగురు మహిళా టీచర్లు అరెస్ట్

నమ్మకద్రోహానికి మారుపేరైన ఎన్‌సిపితో కాని , ఆ పార్టీ నాయకులతో కాని తాము అధికారం పంచుకునే ప్రసక్తి లేదని షిర్సట్ స్పష్టం చేశారు. ఎన్‌సిపితో బిజెపి పొత్తు పెట్టుకోవాలనుకుంటే మహారాష్ట్ర ప్రజలు హర్షించబోరని ఆయన అన్నారు. కాంగ్రెస్, ఎన్‌సిపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టంలేకనే తాము అవిభక్త శివసేన నుంచి వేరుపడ్డామని ఆయన తెలిపారు. అజిత్ పవార్ ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదని, దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఎన్‌సిపిలో ఉండడం ఇష్టం లేనట్లు కనపడుతోందని షిర్సత్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News