Monday, December 23, 2024

సిఎం రేవంత్ రెడ్డికి ఓఎస్‌డిగా అజిత్ రెడ్డి నియామకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్‌డిగా బి అజిత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు చెందిన అజిత్ రెడ్డి ఐదేళ్ల పాటు డిప్యుటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వంలో పని చేయనున్నారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు. అజిత్ రెడ్డి 2012 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెట్ బోర్డుల్లో పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News