Tuesday, November 5, 2024

అజిత్ కృషి ప్రశంసనీయమే: శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

అజిత్ కృషి ప్రశంసనీయమే
కానీ బారామతికి కొత్త నాయకత్వం అవసరం
శరద్ పవార్
పుణె : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతికి చేసిన సేవలను ఎన్‌సిపి (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్ పవార్ మంగళవారం శ్లాఘించారు. అయితే. ఈ ప్రాంతం వచ్చే మూడు దశాబ్దాల పాటు అభివృద్ధి చెండడానికి కొత్త నాయకత్వం అవసరం ఉందని పవార్ స్పష్టం చేశారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన మనవడు ఎన్‌సిపి (ఎస్‌పి) అభ్యర్థి యుగేంద్ర పవార్ తరఫున సీనియర్ పవార్ ప్రచారం చేస్తున్నారు. యుగేంద్ర బారామతిలో తన పెదనాన్న అజిత్ పవార్‌పై పోటీ చేస్తున్నారు.

బారామతిలోని శిర్సుఫల్‌లో ఒక సమావేశంలో శరద్ పవార్ ప్రసంగిస్తూ, ఈ ఏడాది ప్రథమార్ధంలో బారామతి లోక్‌సభ స్థానానికి పోటీ సంక్లిషమైనదని, అది కుటుంబం మధ్య జరగడం అందుకు కారణమని, ఇప్పుడు ఐదు నెలల తరువాత ఈ ప్రాంతం ప్రజలు అటువంటి పరిస్థితిని చూడనున్నారని అన్నారు. బారామతి ఎంపి సుప్రియా సూలె సార్వత్రిక ఎన్నికల్లో తన వదిన, అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌పై విజయం సాధించారు. అజిత్ పవార్ తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర పవార్. ‘మీరు నన్ను ఒక సారి, రెండు సార్లు కాదు, నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారు. మీరు నన్ను 1967లో నన్ను ఎన్నుకున్నారు.

మహారాష్ట్ర కోసం పని చేయడానికి ముందుకు వెళ్లే ముందు 25 ఏళ్ల పాటు ఇక్కడ పని చేశాను. నేను అన్ని స్థానిక అధికారాలను అజిత్ దాదాకు అప్పగించాను, స్థానిక సంస్థలు, చక్కెర, పాడి సంస్థల కోసం ఎన్నికలు, కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు. అన్ని నిర్ణయాలు తీసుకునేందుకు అజిత్‌కు అధికారం అందజేశాను’ అని ఆయన వివరించారు. అజిత్ పవార్ 25 నుంచి30 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో పని చేశారని, ఆయన చేసిన కృషి విషయంలో ఏమాత్రం సందేహం లేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ‘భవిష్యత్తు కోసం సిద్ధం కావలసిన సమయంఇది. వచ్చే 30 సంవత్సరాల కోసం పని చేసేందుకు మనం నాయకత్వాన్ని తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది’ అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం రావాలని, తాను ఎన్నడూ ఎవరినీ వెనుకనే నిలిపివేయలేదని శరద్ పవార్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News