హైదరాబాద్: హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం ‘విడాముయర్చి’(వదిలిపెట్టని పట్టుదల) అనే తమిళ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అతడి సరసన అందాల నటి త్రిష నటిస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు మగిళ్ తిరుమేని, నిర్మాత సుభాస్కరన్ అల్లిరాజా, లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఇంకా అర్జున్ సార్జా, రెజినా కాస్సండ్రా, ఆరవ్ తదితరులు నటిస్తున్నారు. తమిళంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతున్నది. ‘విడాముయర్చి’ సినిమాను చాలా వరకు అజర్ బైజాన్ లో చిత్రీకరించారు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ ఓమ్ ప్రకాశ్ కాగా, సంగీతం అనిరుధ్ రవిచంద్ర అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. దీపావళి పండుగ కూడా అదే నెల రాబోతున్నది.
‘విడాముయర్చి సినిమాతో పాటు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. వీలయినంత త్వరగా తన కమిట్ మెంట్లను పూర్తిచేసుకుని అజిత్ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. బహుశా తన కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళతాడేమో.
#VidaaMuyarchi #EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN
— Trish (@trishtrashers) July 19, 2024