Wednesday, January 22, 2025

అమేథీ ఫ్యాక్టరీ నుంచి ఎకె 203 రైఫిళ్లు

- Advertisement -
- Advertisement -

AK 203 rifles from Amethi factory

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి అత్యంత అధునాతన ఎకె 203 రైఫిళ్లు ఉత్పత్తి కానున్నాయి. ఇక్కడి చిన్న ఆయుధ ఫ్యాక్టరీ నుంచి వీటి తయారీ ఈ ఏడాది చివరిలో ఆరంభమవుతుందని రష్యాకు చెందిన కలష్నికోవ్ ఆయుధ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత్ రష్యాల మధ్య కుదిరిన అధునాతన ఆయుధాలు, పరికరాల సంయుక్త కార్యక్రమంలో భాగంగా ఈ రైఫిళ్లను తయారు చేస్తారు. వీటిని వచ్చే మూడేళ్లలో పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థంతో రూపొందిస్తారని అధికారి తెలిపారు. ఇటీవలి కాలంలో రష్యాకు చెందిన సీనియర్ ఇంజనీర్లు బృందంగా అమేథీ ఫ్యాక్టరీకి వచ్చారు. ఇక్కడి తయారీ సంసిద్ధతను పర్యవేక్షించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News