Saturday, November 23, 2024

గిరిజన గ్రామాల్లో ప్రారంభమైన ఆకడి సంబరం

- Advertisement -
- Advertisement -

కాసిపేట: సంస్క్రతి సంప్రాదాయాలు ఆచార వ్యవహారం కాపాడడంలో భాగంగా మొదటి పండగగా ఆకడి సంబరాలు జరుపుకున్నారు. గురువారం కాసిపేట మండలంలోని కుర్రేగాడ్ గిరిజన గ్రామస్తులు అడవి తల్లికి తొలిపూజ నిర్వహించారు. ఉత్సవాలకు శ్రీకారం, అడవుల్లో వనభోజనాలు, ఏత్మసర్ పేన్‌కు పూజలు నిర్వహించారు. నాలుగు మాసాల పాటు అకడి సంబరాలు కొనసాగుతాయని గిరిజనులు తెలిపారు.

ఆషాడ మాసంలో తొలి ఏకదశి పండగను పురష్కరించుకొని ఆదివాసీల ఆచారం ప్రకారం వనంలో పూజలు నిర్వహించి, పోలిమేరలోకి వెళ్లి చెట్టు క్రింద ఉన్న రాజుల్ పేన్ దేవుడికి ప్రత్యేక పూజలు కోడి పంచాంగం చూడడం గ్రామంలో పాడి పంటలు, పశువులు బాగుండాలని అకిపేన్ వద్ద పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.

ప్రత్యేకంగా లక్ష్మణ రేఖ లాంటి గీత గీసి తయారు చేసిన తూర్రను ఊదూతు పశువులను గీత దాటించడం, సహాపంక్తి భోజనాలు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అకడి అనంతరం నాగుల పంచమి, జమురవుష్, శివబోడి, పోలాల అమావాస్య, బడిగ, దసరా, దీపావళి పండగలను నిర్వహించడం జరుగుతుందని గ్రామ పటేల్ వల్క మోతిరాం, శ్రీను, కుర్సింగ భూదేశావ్,, మదరవ్ లచ్చు, ఈశ్రు, ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News