Monday, January 20, 2025

తెలుగులో ఆకర్ష్ ఖురానా టెలిప్లే ‘యే షాదీ నహీ హో శక్తి’..

- Advertisement -
- Advertisement -

వైవిధ్యమైన దర్శకుడు ఆకర్ష్ ఖురానా 90ల నాటి స్మాల్ స్క్రీన్‌పై ఉల్లాసమైన కేపర్‌తో తిరిగి వస్తున్నారు. రెండు జంటలు, వారి సంక్లిష్టమైన ప్రేమ జీవితాల చుట్టూ అల్లిన ఈ ఆనందకరమైన టెలిప్లే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రేక్షకులకు జనవరి 20న తెలుగులో అందుబాటులో ఉంటుంది.

ప్రేమికుడు లక్ష్మణ్ తన లేడీ లవ్ ప్రియా అక్క పల్లవిని ఎన్నారై వరుడికి కట్టబెట్టాలని పన్నాగం పన్నడంతో మొదలయ్యే సిట్యుయేషనల్ కామెడీని వారు కూడా ఇప్పుడు ఆస్వాదించవచ్చు. అతను ప్రియను పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్నాడు కానీ మొండి పట్టుదలగల పల్లవి పెళ్లికి అంగీకరించే వరకు అలా చేయలేడు. అతని ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక మిస్ ఫైర్ అయి మరెన్నో చిక్కులకు దారితీస్తుందా? ప్రజక్తా కోలి, చైతన్య శర్మ, అధార్ ఖురానా, శిఖా తల్సానియా, ఆకాష్ ఖురానా, అసీమ్ హట్టంగడి, గోపాల్ దత్ నటించిన టెలిప్లే ఈ ప్రశ్నలకు అత్యంత వినోదాత్మకంగా సమాధానం ఇస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News