Friday, November 22, 2024

వాణిజ్య ఆపరేషన్స్ లో 2వ సంవత్సరాన్ని పూర్తి చేసిన ఆకాశ ఎయిర్

- Advertisement -
- Advertisement -

ఆకాశ ఎయిర్, భారతదేశపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్, తమ రెండవ వార్షికోత్సవానని ఈరోజు సంబరం చేస్తోంది, విమానయాన చరిత్రలో ఏ ఇండియన్ ఎయిర్ లైన్ కోసం అయినా గణనీయమైన విజయాల ద్వారా అసాధారణమైన ప్రయాణాన్ని సూచిస్తోంది. ఎయిర్ లైన్ తమ మొదటి వాణిజ్య ఫ్లైట్ 07 ఆగస్ట్ 2022లో ముంబయి నుండి అహ్మదాబాద్ కు తమ వాణిజ్య విమానాన్ని నిర్వహించింది, తమ సానుభూతిత కూడిన సేవా సంస్క్రతి, నమ్మకమైన ఆపరేషన్స్ మరియు సరసమైన ధరలు ద్వారా నాయకత్వంవహించబడే ఇండియన్ ఎయిర్ లైన్ కు ప్రాతినిధ్యానికి కొత్త అర్థాన్ని తెలియచేసింది.

ఆకాశ ఎయిర్ భారతదేశపు అత్యంత ఆన్-టైమ్ ఎయిర్ లైన్ గా స్థిరంగా నిలిచింది. ఇది, ఆపరేషన్ పరమైన సామర్థ్యాలు మరియు సాటిలేని సానుకూలమైన కస్టమర్ ఫీడ్ బ్యాక్ తో కలిసి ఇది భారతదేశంలో ఆరంభమైన నాటి నుండి 11 మిలియన్ కు పైగా ప్రయాణికులు ప్రాధాన్యతనిచ్చిన ఎయిర్ లైన్స్ గా నిలిచింది. ప్రజలు, సంస్కృతులు, ప్రాంతాలను కలపడం ద్వారా విమాన ప్రయాణం కోసం పెరుగుతున్న డిమాండ్ ను తీర్చే తమ ప్రయత్నానికి అనుగుణంగా, ఆకాశ ఎయిర్ మూడు-అంకెల వృద్ధిని నమోదు చేసింది మరియు అంతర్జాతీయ విమానయాన చరిత్రలో అతి వేగంగా పెరుగుతున్న ఎయిర్ లైన్ గా కొనసాగుతోంది

ఈ విజయాన్ని సంబరం చేసుకుంటూ, వినయ్ దూబె, ఫౌండర్, సిఇఓ, ఆకాశ ఎయిర్, ఇలా అన్నారు, “రెండేళ్ల క్రింద, విమాన ప్రయాణానికి కొత్త అర్థాన్ని ఇచ్చే లక్ష్యంతో మేము ప్రయాణాన్ని ఆరంభించాము, మేము నమ్మకం, సేవా శ్రేష్టత మరియు సరసమైన ధరలకు మేము కట్టుబడుతూనే మా లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలిగాం అని నేను గర్వంగా చెబుతున్నాను. భారతదేశపు గగనతలంలో అత్యంత సౌకర్యవంతమైన సీట్లు, తాజా ఇన్-కేబిన్ అనుభవం, మా సానుభూతితో కూడిన క్రూ ద్వారా అందించబడిన మా జాగ్రత్తగా రూపొందించబడిన వంటకాల ఆఫరింగ్స్ తో మేము సాటిలేని ఫ్లైయింగ్ అనుభవాన్ని మేము అందిస్తున్నాము. గొప్ప ఆపరేషనల్ నమ్మకాన్ని నమోదు చేస్తూనే సకాలంలో సామర్థ్యాన్ని అందించడంలో, పరిశ్రమలో తక్కువ కస్టమర్ ఫిర్యాదులు, రద్దులతో నిరంతరంగా భారతదేశపు నాయకునిగా నిలిచాము,

4000కి పైగా ఆకాశియన్లు లేకుండా ఈ మైలురాళ్లు సాధించడం సాధ్యం కాదు. మా ఉమ్మడి విజయాల వెనక వారి ప్రయత్నాలు, అభిరుచిలే ప్రోత్సాహక శక్తిగా ఉన్నాయి.

మా ప్రణాళికలలో మాకు మద్దతు చేసిన మా భాగస్వామ్యుల ఆత్మవిశ్వాసం, అచంచలమైన సహాయాల ప్రత్యక్ష ఫలితం కారణంగా మాకు విజయం చేకూరింది. పరిశ్రమ అభివృద్ధికి మార్గదర్శకత్వంవహించిన పౌర విమానయాన, డిజిసిఎల మంత్రిత్వ శాఖకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మా కలను విశ్వసించిన, తమ నిరంతర, సలహాలకు మా భాగస్వాములకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం, రాబోయే కాలంలో ఉన్న అవకాశాలు, భవిష్యత్తు గురించి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము, భారతదేశం గర్వించే ఎయిర్ లైన్ ను రూపొందించడాన్ని కొనసాగిస్తాం.”

వియన్ ఇలా అన్నారు, “ఆకాశ ఎయిర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేసే క్యారియల్ ఫ్లైయింగ్ గా కంటే ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంది. ఇది భారతదేశపు స్ఫూర్తికి అత్యంత చిహ్నంగా నిలుస్తుంది, విమానయాన మార్కెట్ ను కలిగిన భారతదేశపు సామర్థ్యానికి నిరూపణగా ఉంది.”

సకాలంలో పని చేసే ఎయిర్ లైన్ గా అభివృద్ధ చెందింది

సకాలంలో పనితీరులో ఒక నాయకునిగా ఆకాశ ఎయిర్ అభివృద్ధి చెందింది, అత్యంత నమ్మకమైన ఎయిర్ లైన్ గా ఉండటంలో తన నిబద్ధతకు నిరూపణగా నిలిచింది. సేవా శ్రేష్టత, ఆపరేషనల్ సామర్థ్యానికి దాని అంకితభావం సాటిలేని ఫలితాలుగా మారి సమయ పాలనకు సంస్థ యొక్క స్థిరమైన నిబద్ధత, దాని శక్తివంతమైన షెడ్యూలింగ్, నిర్వహణ పద్ధతుల ద్వారా మద్దతు చేయబడిన నిరంతర ప్రయాణాన్ని ప్రదర్శించింది.

వేగవంతమైన వాణిజ్య విస్తరణ

ఆకాశ ఎయిర్ ప్రస్తుతం 22 డొమేస్టిక్ మరియు అయిదు అంతర్జాతీయ పట్టణాలను కలుపుతోంది, అవి ముంబయి,అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, గౌతి, అగర్తల, పూణె, లక్నో, గోవా, హైదరాబాద్, వారణాసి, బాగ్ డోగ్రా, భువనేశ్వర్, కొల్ కత్తా, పోర్ట్ బ్లైర్, అయోధ్య, గ్వాలియర్, శ్రీనగర్, ప్రయాగరాజ్, గోరఖ్ పూర్, దోహా (ఖతార్), జెడ్డా, రియాధ్ (కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా), అబు ధాబి (యుఏఈ), మరియు కువైట్. ఎయిర్ లైన్ ఇప్పుడు 22 డొమేస్టిక్ మరియు అయిదు అంతర్జాతీయ గమ్యస్థానాల్లో వారానికి 900కి పైగా విమానాలను ఆపరేట్ చేస్తోంది, రెండేళ్ల అతి తక్కువ సమయంలో 11 మిలియన్ లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించిన మైలురాయిని సాధించింది.

తమ ఎయిర్ క్రాఫ్ట ఆర్డర్, అంతర్జాతీయ ఆపరేషన్లతో చరిత్రను సృష్టించడం కొనసాగించింది

జనవరి 2024లో, ఆకాశ ఎయిర్ 150 ఎయిర్ క్రాఫ్ట్ ల శక్తివంతమైన ఆర్డర్ ను ప్రకటించింది, ఆపరేషన్స్ ను ప్రారంభించిన 17 నెలలు లోగా ఇంత పరిమాణంలో శక్తివంతమైన ఆర్డర్ బుక్ చేయడాన్ని చేరుకోవడంలో పౌర విమానయాన చరిత్రలోనే ఏకైక ఇండియన్ ఎయిర్ లైన్ గా మారింది. ఈ ల్యాండ్ మార్క్ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ ఎయిర్ లైన్ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను శక్తివంతం చేసింది. తన దృఢమైన ఆర్థిక పునాదికి నిరూపణగా నిలిచింది.

2024 మార్చిలో, ఆకాశ ఎయిర్ 19 నెలల రికార్డ్ సమయంలో విదేశాల్లో ఫ్లై చేసే మొదటి ఇండియన్ ఎయిర్ లైన్ గా మారింది. అప్పటి నుండి, ఆకాశ ఎయిర్ వేగంగా తమ అంతర్జాతీయ ఉనికికి మద్దతు ఇచ్చింది మరియు అంతర్జాతీయంగా ఫ్లైయింగ్ ను ప్రారంభించిన 120 రోజుల లోగా దోహా, కువైట్, రియాద్, అబు ధాబీ, జెడ్డా వంటి అయిదు గమ్యస్థానాలకు వారానికి 35 అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది.

సేవా శ్రేష్టతకు నిబద్ధత

ఆకాశ ఎయిర్ సానుభూతితో కూడిన ఉత్సాహపు వ్యక్తిత్వం, ఉద్యోగహితమైన సంస్క్రతి, కస్టమర్-సేవా సిద్ధాంతం, మరియు టెక్-నాయకత్వంవహించే విధానం లక్షలాది కస్టమర్లు కోరుకునే ఎయిర్ లైన్ గా మార్చింది. ఇది ఆరంభమైన నాటి నుండి, ఆకాశ ఎయిర్ పరిశ్రమలో తమ ఎన్నో ప్రథమ అంశాలతో మరియు కస్టమర్ హితమైన ఆఫరింగ్స్ తో భారతదేశంలోనే ఫ్లైయింగ్ కు కొత్త అర్థాన్ని ఇచ్చింది. సాటిలేని ఫ్లైయింగ్ అనుభవాన్ని అందించడానికి తమ స్థిరమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఆకాశ ఎయిర్ కొన్ని చొరవలు చేపట్టింది, ఎయిర్ లైన్ వారి ఆన్ బోర్డ్ భోజన సేవలైన కేఫ్ ఆకాశ Café Akasa, నేటికి మొత్తం 3.8 భోజనాలను అందచేసింది. పరిశ్రమలోనే మొదటిసారి ఫ్యూజన్ భోజనాలు, అపిటైజర్స్ తో విశిష్టమైన రుచికరమైన వంటకాల అనుభవాన్ని ప్రాంతీయ రుచులు, నోరూరించే మిఠాయిలను అందచేసింది.

ఆకాశలో పెంపుడు జంతువులు, ఈ ఎయిర్ లైన్స్ యొక్క పెంపుడు జంతువుల హితమైన క్యారేజీ పాలసీకి నెట్ వర్క్ అంతటా ప్రయాణికుల నుండి అనూహ్యమైన ప్రతిస్పందనతో కూడిన ప్రోత్సాహం లభించింది. కస్టమర్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని, పెంపుడు జంతువుల కోసం ఇంతకు ముందున్న 7 కేజీల పరిమితి నుండి 10 కేజీల బరువు పరిమితిని కేబిన్ లోపలికి అనుమతించింది. నవంబర్ 2022లో ఈ సర్వీస్ విడుదలైన నాటి నుండి, ఆకాశ ఎయిర్ డొమేస్టిక్ నెట్ వర్క్ అంతటా 3700 పెంపుడు జంతువులను తీసుకువెళ్లింది.

ఆకాశ ఎయిర్ ఆకాశ గెట్ ఎర్లీ, సీట్ & మీల్ డీల్, అదనపు సీట్, ఉత్తమమైన వ్యక్తిగత అనుభవాన్ని ఇచ్చే ఆకాశ హాలీడేస్ వంటి 25+ అనుబంధ ఉత్పత్తులను తమ సాటిలేని కస్టమర్ సర్వీస్ యొక్క వాగ్థానంపై అందిస్తోంది. తమ కస్టమర్ల కోసం నిరంతరంగా కేబిన్ అనుభవాన్ని మెరుగుపరుస్తూ, ఆకాశ స్కై స్కోర్ బై ఆకాశ, స్కై లైట్స్ మరియు క్వైట్ ఫ్లైట్స్ వంటి పరిశ్రమలో పలు మొట్ట మొదటి చొరవలను ఆరంభించింది.

ఆతృతగా ఎదురుచూడటం

నిర్వహ, ఆర్థిక క్రమశిక్షణ మద్దతు ద్వారా వ్యయ నాయకత్వానికి ఆకాశ వారి స్థిరమైన కట్టుబాటు, లాభదాయకత దిశగా విజయవంతమైన మార్గంలో ఎయిర్ లైన్ ను ఉంచింది. గత ఆర్థిక సంవత్సరంలో, ఆకాశ ఉపలబ్దమైన సీటు కీలోమీటర్లలో (ఎఎస్ కేఎం) 300% వృద్ధిని సాధించింది. 122 సంవత్సరాల అంతర్జాతీయ చరిత్రను అధిగమించే ఎయిర్ లైన్ వృద్ధి కోసం కొత్త రికార్డ్ ను నెలకొల్పింది. శక్తివంతమైన ఆర్థిక పునాదితో ఎయిర్ లైన్ రూపొందించబడింది, దీని ఉపలబ్ద సీటు కిలోమీటర్లలో ఇయర్ –ఆన్-ఇయర్ 50% పెంపుదల అంచనా వేయబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News