Wednesday, January 22, 2025

ఆకాశ ఎయిర్ మూసివేత?

- Advertisement -
- Advertisement -

ఒకేసారి 43 మంది పైలట్ల రాజీనామాతో సంక్షోభం
700 విమానాలు రద్దు చేసే అవకాశం

న్యూఢిల్లీ: ఒకేసారి 43 మంది పైలట్లు రాజీనామాతో కొత్తగా ప్రారంభించిన ఆకాశా ఎయిర్ సంక్షోభంలో కూరుకుపోయింది. విమాన సంస్థ మూతపడొచ్చనే వార్తలు వినిపిస్తున్నా యి. పైలట్ల ఆకస్మిక రాజీనామా వల్ల సెప్టెంబర్‌లో ప్రతి రో జు దాదాపు 24 ఫ్లైట్లు రద్దు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు విమానయాన సంస్థ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో సమాచారం అందించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆకాశ ఎయి ర్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వారు ఊహించని సిద్ధమయ్యారు. ఆకస్మిక నిర్వహణా వ్యూహాలను కల్గివున్నారు’ అని పైలట్లను ఉద్దేశించి పేర్కొంది.

అయితే కంపెనీకి బలమైన ఆ ర్థిక ప్రొఫైల్ ఉందని ఆకాశ అధికారులు తెలిపారు. ఎయిర్‌లైన్ న్యాయవాది మాట్లాడుతూ, ‘పైలట్‌లు తప్పనిసరి నోటీ సు వ్యవధిని పూర్తి చేయకపోవడంతో అకాశా ఎయిర్ ప్రతిరోజూ అనేక విమానాలను రద్దు చేయవలసి వచ్చింది. మొ దటి అధికారులకు నోటీసు వ్యవధి 6 నెలలు, కెప్టెన్లకు 1 సంవత్సరం ఉంది. అకాశా ఎయిర్ పైలట్లు ప్రత్యర్థి విమానయాన సంస్థలో చేరారని బిజినెస్ స్టాండర్డ్ ఒక నివేదిక పే ర్కొంది. ఆకాశా ఎయిర్‌కు చెందిన ఒక అధికారి ప్రత్యర్థి వ ర్గానికి ఆందోళన వ్యక్తం చేస్తూ, అనైతికమని లేఖ రాశారని కూడా పేర్కొంది.

600-700 ఫ్లైట్లు రద్దు కావచ్చు..
ఆకాశ రోజుకు 120 విమానాలను నడుపుతోంది. ఈ నెలలో 600-700 విమానాలు రద్దు కావచ్చు. ఆగస్టులో కూడా 700 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఆగస్టులో అకా శ మార్కెట్ షేర్ 4.2 శాతానికి క్షీణించింది. తప్పనిసరి నో టీసు వ్యవధి నిబంధనలను అమలు చేసే అధికారాన్ని ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)కి ఇవ్వాలని ఎయిర్‌లైన్ కోర్టును అభ్యర్థించింది.

కాంట్రాక్టు నోటీసు వ్యవధిని పూర్తి చేయకుండా వెళ్లిపోయిన పైలట్లపై శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్ డి మాండ్ చేస్తోంది. విమానాల రద్దుతో ఆదాయం పడిపోయిందని, దీనికి పరిహారంగా రూ.22 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అంతర్జాతీయ విమానాలకు అకాశ గ్రీన్ సిగ్నల్ పొందింది.అయితే ఇది విమానాలను నడపాలనుకుంటున్న దేశాల నుండి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం విమానయాన సంస్థ దేశీయ రూట్లలో మాత్రమే నడుస్తోంది. అకాశ ఎయిర్ 2022 ఆగస్టు 7న ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News