Thursday, January 16, 2025

గోవా నుంచి బెంగళూరు, ముంబైలకు ‘ఆకాశ ఎయిర్’ విమానాలు

- Advertisement -
- Advertisement -

గోవా: భారత ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ తన ఫ్లయిట్ నెట్‌వర్క్‌లో గోవాను 12 వ గమ్యస్థానంగా నేడు చేర్చింది. ఈ ఎయిర్‌లైన్ గోవా నుంచి బెంగళూరుకు రెండు డైలీ ఫ్లయిట్స్ నడుపుతోంది. కాగా 2023 ఫిబ్రవరి 1 నుంచి రోజుకు మూడు నడుపనుంది. కాగా గోవా నుంచి ముంబైకు రోజూ రెండు ఫ్లయిట్స్ నడుపుతుంది. దేశంలోని కమర్షియల్ సిటీలను కలుపడంలో ఇప్పుడు గోవాను కూడా చేర్చుకుంది. దీనివల్ల వృద్ధి ఉంటుందని ఆ విమాన కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది.

ఆకాశ ఎయిర్ 2022 ఆగస్టు నుంచి పనిచేయడం ఆరంభించింది. ఆరు నెలల్లో 5లక్షలకు పైగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది.2022 డిసెంబర్ ఆఖరుకల్లా మొత్తం 12 రూట్లలో 12 నగరాలను ఈ ఫ్లయిట్ కంపెనీ కలుపుతుంది. వాటిలో అహ్మదాబాద్, బెంగళూరు, కొచి, చెన్నై, ముంబై, ఢిల్లీ, గౌహతి, అగర్తలా, పుణె, విశాఖపట్నం, లక్నో, గోవా ఉన్నాయి. ఆకాశ ఎయిర్ విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా లేక దాని వెబ్‌సైట్ ఆకాశ్‌ఎయిర్ డాట్ కామ్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News