Tuesday, December 24, 2024

బుకింగ్స్ ప్రారంభించిన ’ఆకాశ్ ఎయిర్‘

- Advertisement -
- Advertisement -

 

Akasa Air

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ లో పేరుమోసిన మదుపరుడు రాకేశ్ ఝున్‌జున్‌వాలాకు చెందిన  ‘ఆకాశ ఎయిర్’ తన మొదటి వాణిజ్య విమానాన్ని ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో  బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ద్వారా నడుపనుంది.
ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు,  ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్‌లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఎయిర్‌లైన్ క్యారియర్ తెలిపింది. “మేము సరికొత్త బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ముంబై – అహ్మదాబాద్‌ల మధ్య విమానాల రాకపోకలను ప్రారంభించాము” అని ఆకాశ్ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు,  చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News