Monday, December 23, 2024

ఉద్యోగులకు వాటాలు

- Advertisement -
- Advertisement -

Akasa airline will use stock options to lure staff

ఆఫర్ చేయనున్న ‘ఆకాశ ఎయిర్‌లైన్’

న్యూఢిల్లీ : స్టాక్‌మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన విమాన సంస్థ ఆకాశ ఎయిర్ తన ఎయిర్‌లైన్స్ సిబ్బందికి స్టాక్ ఆప్షన్‌ను ఆఫర్ చేయాలని యోచిస్తోంది. ఈ సంస్థ ఈ ఏడాది మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో సేవలను ప్రారంభించనుంది. రానున్న రోజుల్లో దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద పోటీ నెలకొననుంది. ఆకాశ ఎయిర్, జెట్ ఎయిర్‌వెట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియాను టాటాకు తిరిగి సొంతం చేసుకున్న తర్వాత వృద్ధి దిశగా పనులు వేగవంతం చేసింది. ఈ పరిస్థితుల్లో విమానయాన రంగంలో పనిచేస్తున్న వారికి కొత్త అవకాశాలు రానున్నాయి. ఇతర ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఉద్యోగులను ఆకర్షించడంలో కంపెనీలు బిజీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆకాశ ఎయిర్ తన ఉద్యోగుల కోసం స్టాక్ ఆప్షన్‌లను ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. తద్వారా ఉద్యోగులు పోటీకి తగ్గట్టుగా కష్టపడతారని సంస్థ భావిస్తోంది.

ఇప్పటి వరకు ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు మాత్రమే తమ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్‌లను ఇస్తున్నాయి. అయితే ఆకాశ ఎయిర్ ఇది అమలు చేస్తే విమానయాన రంగంలో ఇదే తొలిసారి అవుతుంది. టాప్ ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ కింద షేర్లను ఇవ్వడం ద్వారా సంస్థపై సిబ్బందికి నమ్మకం పెంచాలని ఆకాశ ఎయిర్ భావిస్తోంది. ఆకాశ ఎయిర్ కార్యాలయం కార్యకలాపాల కోసం 50 మంది ఉద్యోగులను నియమించింది. ఇక పైలట్లు, విమాన సహాయకులు, విమానాశ్రయ సిబ్బందిని నియమించుకునే పనిలో ఉంది. 2023 మార్చి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను తన ఫ్లీట్‌లో చేర్చుకోవాలని అకాసా ఎయిర్ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సంస్థ తక్కువ ఇంధన వినియోగం కలిగిన 72 బోయింగ్ 737 మాక్స్ విమానాల కోసం కంపెనీ ఆర్డర్ చేసింది. అకాశ ఎయిర్ మొదట మెట్రోల నుండి టైర్-2, 3 నగరాలకు సేవలను ప్రారంభిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News