Monday, April 7, 2025

విశ్వక్‌సేన్ ఎలాంటి పాత్రనైనా చేస్తారు

- Advertisement -
- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఈనెల 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ “ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రాంక్ వీడియో చేశాం. అయితే ఆతర్వాత జరిగిన పరిణామాలకు చింతిస్తున్నా. వివాదంతో నా సినిమాకు హైప్ తెచ్చుకోవాలనే దురాశ నాకు లేదు”అని అన్నారు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ “ఈ సినిమాలో మంచి పాత్ర లభించడంతో సంతోషంగా ఉంది. నా పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. నటనకు ఆస్కారమున్న పాత్రలో ప్రేక్షకులను అలరిస్తాను”అని తెలిపారు. దర్శకుడు విద్యాసాగర్ చింతా మాట్లాడుతూ “విశ్వక్‌సేన్ ఎలాంటి పాత్రనైనా చేస్తారు. ఈ సినిమాలో విశ్వక్ కనిపించరు… అర్జున్‌కుమార్ అల్లం మాత్రమే కనిపిస్తారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బాపినీడు, సుధీర్ ఈదర తదితరులు పాల్గొన్నారు.

Akasa Vanamlo Arjuna Kalyanam Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News