Sunday, December 22, 2024

పాండ్యా లేకపోతే రోహితే కెప్టెన్: చోప్రా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆఫ్ఘానిస్తాన్‌తో టి20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఎంపిక చేయడంతో టీమిండియా బలంగా మారిందని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్ తెలిపారు. ప్రపంచ కప్ ముందు భారత్ మూడే మ్యాచులు ఆడ నుండడంతో వీరిని జట్టులోకి తీసుకున్నారు. తరువాత ఐపిఎల్ ఉండడంతో గాయపడిన ఆటగాళ్లు అప్పటివరకు కోలుకునే ఆస్కారం ఉందని చెప్పారు. అలాగే యువకులకు కూడా మరిన్ని అవకాశాలు కల్పించడం అభినందనీయం ప్రశంసించారు. ఆఫ్గాన్ సిరీస్‌తో పాటు వరల్డ్ కప్‌లో సీనియర్లను తప్పకుండా చూస్తామని ఎంఎస్‌కె పేర్కొన్నారు.

హార్ధిక్ పాండ్యా గాయపడడంతో రోహిత్ శర్మకు టీమిండియా పగ్గాలు అందిస్తారని ముందే భావించానని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో హార్ధిక్ పాండ్యా గాయపడడంతో అతడు కెప్టెన్‌గా ఉండడని ముందే ఊహించానన్నారు. పాండ్యా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండడంతో నేరుగా అతడు ఐపిఎల్‌లో ఆడే అవకాశం ఉందని ఆకాశ్ వెల్లడించారు. గాయం కోలుకొని, ఫిట్‌నెస్ సాధిస్తే అతడు నేరుగా టి20 వరల్డ్ కప్‌లో వస్తాడని లేకపోతే రోహిత్‌కే బాధ్యతలు అప్పగిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News