Monday, December 23, 2024

కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేయండి.. (‘చోర్ బజార్’ ట్రైలర్)

- Advertisement -
- Advertisement -

Samantha likes KTR's Instagram Post

ఆకాష్ పూరీ హీరోగా నటించిన సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటించిన ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకుడు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ “దర్శకుడు జీవన్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఒక మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దామని ఈ సినిమా నిర్మించాం. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి”అని అన్నారు. దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ “మంచి కమర్షియల్, కలర్‌ఫుల్ సినిమా చేశాం. హీరో ఆకాష్… బచ్చన్ సాబ్ అనే ఈ క్యారెక్టర్‌లో పర్పెక్ట్ గా నటించారు”అని చెప్పారు. ఆకాష్ పూరి మాట్లాడుతూ “పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. కుటుంబంతో వచ్చి సినిమాను ఎంజాయ్ చేయండి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ గెహనా సిప్పీ పాల్గొన్నారు.

Akash Puri’s ‘Chor Bazaar’ to release on June 24th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News