Thursday, November 14, 2024

అప్పుడు కాలర్ ఎగిరేస్తాః ఆకాష్ పూరి

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వచ్చిన ‘రొమాంటిక్’ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. పూరి కనెక్ట్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ “నేను మొదటిసారి రొమాంటిక్ సినిమాలో క్లైమాక్స్ చూసి ఏడ్చాను. నేనే నటించాను కదా? ఎందుకు ఏడ్చాను? అని అనుకున్నాను. కానీ ఆ ఎమోషనల్ అలాంటిది. క్లైమాక్స్‌లో నన్ను కొట్టే సీన్ నుంచి.. చివరి సీన్ వరకు అమ్మ ఏడుస్తూనే వచ్చింది. నా నటనను చూసి అమ్మ ఎంతో సంతోషించారు. నాన్న చూసిన సక్సెస్‌లు వేరు. ఆయన స్థాయికి నేను వచ్చాక.. కాలర్ ఎగిరేస్తా. అది ఒక్క హిట్‌తో వచ్చేది కాదు. ఆ స్థాయికి వచ్చే వరకు ఎంత కష్టమైన పడతాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ పాదూరి, భాస్కర్ భట్ల, సునీల్ కశ్యప్ పాల్గొన్నారు.

Akash speech at Romantic success event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News