- Advertisement -
న్యూఢిల్లీ: కాశ్మీర్ గేట్ ఐఎస్‌బిటి వద్ద మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని నిరసిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ఢిల్లీలోని లుటియన్స్‌లోని అక్బర్ రోడ్డు సైన్ బోర్డును నలుపు పెయింట్‌తో చెరిపేశారు. ఆ సైన్‌బోర్డు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌డిఎంసి) పరిధిలోకి వస్తుంది. ఈ విషయంలో దర్యాప్తు జరిపాక ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేస్తామని ఎన్‌ఎండిసపి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు దర్యాప్తును ఆరంభించారు. ఎవరు దీనికి పాల్పడిందనేది గుర్తించేందుకు వారు సిసిటివి ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఇందిలావుండగాద నిందితులను గుర్తించేంత వరకు పౌరులు శాంతిని పరిరక్షించాలని అధికారులు అభ్యర్థించారు.
- Advertisement -