- Advertisement -
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఓ కారణమని ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ మిత్రులు ఈ విషయాన్ని అంగీకరించాలని సూచించారు. కాగా ధరణి పోర్టల్ ను వీలైనంత త్వరగా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. ధరణి వచ్చాక ఎవరిపై ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయో తాను వివరాలతో సహా వివరిస్తానని అన్నారు.
రాష్ట్రప్రభుత్వం ధరణి పోర్టల్ పేరును ఇప్పటికే ‘భూమాత’గా మార్చింది. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కూడా. ధరణి సమస్యలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు ధరణి పోర్టల్ ను భూమాతగా మార్చారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు.
- Advertisement -