Sunday, April 6, 2025

కోర్టు తీర్పుపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

- Advertisement -
- Advertisement -

Akbaruddin Owaisi

హైదరాబాద్‌: ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై ఉన్న రెండు కేసులను బుధవారం కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. కాగా కోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు.

‘విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో అక్బరుద్దీన్ ఒవైసీపై రెండు క్రిమినల్ కేసుల్లో  స్పెషల్ కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. మా కోసం ప్రార్థనలు, మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. తమ విలువైన సహాయాన్ని అందించిన న్యాయవాది అబ్దుల్ అజీమ్ ఎస్‌బి, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అసదుద్దీన్‌ ట్విట్‌ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News