Sunday, December 22, 2024

జైలుకు పంపి చంపాలని చూస్తున్నారు : అక్బరుద్దీన్

- Advertisement -
- Advertisement -

లోకసభ ఎన్నికల తరుణంలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీ లో జరిగిన ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఒవైసీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఓవైసి బ్రదర్స్‌ను జైలుకు పంపాలని చూస్తునానరని అన్నారు. జైల్లో మెడిసిన్ పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మలను చంపాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తమ పార్టీ చాలా బలంగా ఉందని, అందుకే మమ్మల్ని ఓడించాలని చూస్తున్నారని అక్బరుద్దీన్ అన్నారు. ఎవరు ఎంత ప్రయత్నించినా తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. అక్బరుద్దీన్ చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. జైల్లోనే స్లో పాయిజన్ ఇచ్చి హత్య చేయడం ఇప్పుడు అందరిలోనూ పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వారికి ఎంఐఎం పార్టీ మద్దతిస్తున్న విషయం తెలిసిందే. గతంలో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించిన ఎంఐఎం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది.

ప్రస్తుత లోక సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. కొందరు కాంగ్రెస్ బీ టీమ్ అంటూ ప్రచారం చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తమతో కలుస్తున్నారని అన్నారు. అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారితో కలిసి పనిచేస్తామని, అభివృధ్ధి జరగాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. ఎంఐఎంను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని అక్బరుద్దీన్ అన్నారు. ఓవైసీ బ్రదర్స్ ను అంతమొందించే కుట్ర జరుగుతోందని, కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని, అది అంత సులభం కాదని అక్బరుద్దీన్ అన్నారు. తమను జైలుకు పంపించి అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపేయవచ్చని, లేదా గన్ తో కాల్చి చంపేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే జరిగిన ఓ బహిరంగ సభలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నాయని, కానీ తాను అంత ఈజీగా వెళ్లిపోయేవాడిని కాదని పేర్కొన్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల వేళ ఒవైసీ బ్రదర్స్ చేసిన ఈ కామెంట్లు సంచలనంగా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News