Tuesday, January 21, 2025

అసెంబ్లీలో స్పీకర్ ను నిలదీసిన అక్బరుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  శాసన సభను క్రమశిక్షణలో పెట్టడమో, లేదంటే సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడమో, లేదంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వారిని సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని ఎంఎంఐ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సభాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు.  ఇంతకీ ఏం జరిగిందంటే.. బిఆర్ఎస్ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని సిఎం రేవంత్‌రెడ్డి అవమానించారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ సభ్యులు ఈ రోజు సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ నిరసన తెలిపారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకే ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై చర్చించాలని సిఎం రేవంత్ కోరారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

అక్బరుద్దీన్ ఒవైసీ వెంటనే లేచి మాట్లాడారు.  నిన్నటి సభలో సబిత పేరును ప్రస్తావించారు కాబట్టి.. వివరణ ఇచ్చుకోవాల్సిన హక్కు ఆమెకు ఉందని పేర్కొన్నారు. ఆమెకు మైక్ ఇవ్వలేదని, సభలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న వారిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలని… కానీ, ఆ పని కూడా చేయడం లేదని, తనకు మైక్ కూడా ఇవ్వడం లేదని, ఇది సరికాదని అక్బరుద్దీన్ అసహనం వ్యక్తం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News