Monday, December 23, 2024

తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ: అక్బరుద్దీన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
కేంద్రం చేస్తున్న అన్యాయంపై సభలో ఒక రోజు చర్చ జరగాలని ఆయన శాసనసభలో ప్రస్తావించారు. శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. నోట్ల రద్దు, జిఎస్‌టికి మద్దతు వద్దు అన్నామని, సిఎం కెసిఆర్ ఏమి కాదు అంతా మంచి జరుగుతుందన్నారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలు పేర్కొనలేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల అంశాన్ని ప్రస్తావించలేదు. కేంద్రం అన్యాయం చేస్తోందని సీఎం బయట చెబుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాలు ఎందుకు లేవు?’ అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉర్దూకు రెండవ అధికార భాషా గుర్తించినా..ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మసీదు నిర్మాణం ఏ స్టేజిలో ఉందో చెప్పాలని శాసన సభలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందనలు చెబుతాం…పనులు కాక పోతే మాట్లాడతామన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు కడుతున్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఎంటి ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పాతబస్తీ లో ఆ స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ ,పాతబస్తీలో మెట్రో సంగతి ఎంటి ? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రభుత్వం హామీలు ఇస్తుంది .. వాటిని అమలు చేయదా ? అన్నారు. సిఎం కేసీఆర్, మంత్రులు బిజీగా ఉంటారు.. మాకు తెలుసు, మీరు చప్రసి అయిన చూపించండి. తెలంగాణ కోసం, పాతబస్తీ వారి కోసం అయిన వారిని కలుస్తామన్నారు. బిఆర్‌ఎస్ పెట్టినందుకు అభినందనలు.

మమ్మల్ని బి టీమ్ అన్నారు. ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలో వెళ్లారు. ఏ టీమ్ అంటారో? రెండు పార్టీలు మాత్రమే ఉండాలని కొందరు అనుకుంటారని సెటైర్ వేశారు. పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తామని కెసిఅర్ అన్నారు కానీ ఉన్న స్థాయిలో అభివృద్ధి చేయండని ఆయన కోరారు. నగరంలో 70 శాతం సిసిటివి కెమెరాల నిర్వహణ సరిగ్గా లేదని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేయాలని, పిఆర్‌సి ఇవ్వాలని కోరారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News