Sunday, December 22, 2024

కావాలంటే.. నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి: హైడ్రా కూల్చివేతలపై ఒవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో అక్రమకట్టడాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ కట్టడాలను కూడా కూల్చివేస్తారా? అని భయపడుతున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ తెోపాటు పలువురి అక్రమకట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో సోషల్ మీడియాలో హైడ్రా కూల్చివేతలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చెరువులను కబ్జా పెట్టి నిర్మించారంటూ పలువురు.. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

ఇందులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసికి చెందిన బిల్డింగ్ లు కూడా ఉన్నాయి. బండ్లగూడ‌లోని ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందని వార్తలు వస్తుండటంతో ఆయన స్పందించారు. ‘పేదలకు ఉచిత విద్యనందించేందుకు 12 బిల్డింగ్‌లు నిర్మించా. కొందరు వీటిపై వక్రదృష్టి పెట్టారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి’ అని అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.

ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు తమ కాలేజీలను చెరువులను కబ్జాచేసి కట్టారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటిని కూడా హైడ్రా కూల్చివేసేందుకు సిద్ధమైతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News