Monday, December 23, 2024

ఎన్నికల బరిలో అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ?

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: రానున్న తెంటాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎఐఎంఐఎం) ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంద్రాయాణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఎంఐఎం సభాపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు ఎంబిబిఎస్ చదివిన డాక్టర్ రూరుద్దీన్ ఒవైసీని పాతబస్తీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపాలని ఎంఐఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే నూరుద్దీన్ ఒవైసీని ఎన్నికలలో నిలబెట్టాలని ఆయన తండ్రి అక్బరుద్దీన్, ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి, ఆయన పెదనాన్న అసదుద్దీన్ ఒవైసీ భావించారని, అయితే వయసు సరిపోని కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైనందున నూరుద్దీన్‌ను ఎన్నికల బరిలోకి దింపాలని ఎంఐఎం నిర్ణయించుకున్నట్లు వారు చెప్పారు. ప్రస్తుతం నూరుద్దీన్ సలార్ ఎ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు ట్రస్టీగా, కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం హైదరాబాద్ పా బస్తీకే పరిమితం కాకుండా తెలంగాణలో పలుచోట్ల పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే&పార్టీ నాయకులతో, భాగస్వామ్య పక్షాలతో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు వర్గాలు తెలిపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 50 స్థానాలకు పోటీ చేయాలని అక్బరుద్దీన్ ప్రతిపాదించారు. అయితే వివిధ కారణాల వల్ల ఆది కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం ఎంఐఎం తన బలాన్ని తెలంగాణలో విస్తరించుకోవాలని గట్టిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News