Wednesday, January 22, 2025

రాజకీయాలు ఎన్నికల వరకే… కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారని అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ముస్లింల అభివృద్ధికి కృషి చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చామని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చారు.. అందులో ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యం అన్నారు. బిజెపి ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేక పోయిందని తెలిపారు. ముస్లింల అభివృద్దికి ఆ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని కోరుతున్నామన్నారు. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే… గెలిచిన పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రజల కోసం పనిచేయాలని అక్బరుద్దీన్ పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News