Wednesday, January 22, 2025

రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు: అక్బరుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

శ్వేతపత్రం విడుదల వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం చెప్పాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు పెరగడం వాస్తవం.. అభివృద్ధి జరిగినది కూడా వాస్తవమేనన్నారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెబుతున్నారని.. ఇప్పుడే ఎందుకు రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని.. తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీ నుంచి తప్పుడు సమాచారం బయటకు పంపకూడదని.. గత ప్రభుత్వం తప్పు చేస్తే దర్యాప్తు జరపండి.. సహకరిస్తామని తెలిపారు. సభను తప్పుదోవ పట్టించిన బ్యూరోక్రాట్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్వేతపత్రంలో ఆర్బిఐ, కాగ్, రిపోర్టులను ప్రస్తావించారని.. అందులో తమకు అనుకూలమైన అంశాలనే తీసుకున్నారని చెప్పారు.ఆందోళన చేయడానికి మేము అసెంబ్లీకి రాలేదు. రాష్ట్ర ప్రజల తరుపున ప్రశ్నించడానికి వచ్చామని.. రాష్ట్రాన్ని రక్షించుకునేందుకే మాట్లాడుతున్నాని అక్బరుద్దీన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News