Sunday, December 22, 2024

ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు(శనివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజ్ భవన్ లో శాసనసభ ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేత గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాష్ట్ర శాసనసభలో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా,  స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News