- Advertisement -
హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల సంస్కృతి(డ్రగ్స్ కల్చర్) పెరుగుతోందని ఎంఐఎం ఎంఎల్‌ఏ అక్బరుద్దీన్ ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ నగరంలో కోట్లాది రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్నారు. దీనిని అరికట్టడంలో నార్కోటిక్స్ నివారణ శాఖ పూర్తిగా విఫమైందన్నారు. నగరంలో యువత మత్తుకు అలవాటుపడ్డం తీవ్ర అంశమని ఆయన అన్నారు. ఔషధ దుకాణాలలో డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా డ్రగ్స్ ఇవ్వకుండా చూడాలన్నారు. ‘కాగ్’ నివేదికను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
- Advertisement -