Tuesday, December 17, 2024

‘అఖండ’ పెద్ద హిట్ కావాలి

- Advertisement -
- Advertisement -

రాజమౌళి

Akhanda movie

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుద ల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడు తూ.. డిసెంబర్ 2 నుంచి ‘అఖండ’తో అన్ని థియేటర్లు అరుపులు, కేకలతో నిండిపోవాలి. మాకు ఇప్పుడు ఎంతో ఆనందం వచ్చింది. తెలుగు వాళ్లందరికి అదే ఆనందం రావాలి. కచ్చితంగా వస్తుంది అని చెబుతున్నా. బాలయ్య బాబు ఒక ఐటమ్ బాంబు.. ఎలా ప్రయోగించాలో శ్రీనుకు తెలుసు. ఆ సీక్రెట్ ఎంటో శ్రీను చెప్పాలి. బాలయ్య బాబు కూడా ఎనర్జీ సీక్రెట్ చెప్పాలి. అఖండ చాల పెద్ద హిట్ కావాలి అని కోరుకుంటున్నా అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ చూశాను, పూనకాలు వచ్చేలా ఉంది. సెకండ్ వేవ్ తరువాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. అఖండ జ్యోతిలా తెలుగు సినిమా కు ఈ చిత్రం వెలుగునివ్వాలని అంద రం కోరుకుటున్నాం.. ఈ ఉత్సాహాన్ని ఇలానే కొనసాగిస్తూ.. మరో రెండు వారాల్లో రాబోతోన్న ‘పుష్ప’ ఆ తరువా త రాబోతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’… అలా ముందుకు వెళ్లాలి. ఇండస్ట్రీ గెలవాలి అని తెలిపారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. కరోనా కాలంలో కూడా ప్రాణాలను తెగించి షూటింగ్ చేశాము. ఇప్పుడు చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. వాటికి రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించాలి అని చెప్పారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘అఖండతో నేను గెలవాలని అనుకోలేదు… సిని మా గెలవాలని అనుకున్నాను. సుకుమార్ గెలవడం కాదు… ‘పుష్ప’ గెలవాలి. సినిమానే గెలు స్తూ ఉండాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల రవీందర్ రెడ్డి, శ్రీకాంత్, పూర్ణ, ప్రగ్యా జైస్వాల్, తమన్, గోపిచంద్ మలినేని, కల్యాణ్ చక్రవర్తి, ఎస్పీ చర ణ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News