Friday, February 7, 2025

ప్రేమ, హారర్, కామెడీ అంశాలతో..

- Advertisement -
- Advertisement -

మారిశెట్టి అఖిల్ హీరోగా, భానుశ్రీ హీరోయిన్‌గా శ్రీధన్ దర్శకత్వంలో ఎ.కె. టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్ నిర్మించే నూతన చిత్రం చిత్రీకరణ ప్రారంభమైంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలోని రామాలయంలో చిత్రీకరణ మొదలైంది. టైటిల్ నిర్ణయించాల్సిన ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నిర్మాత నట్టి కుమార్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మారిశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ “ఈ చిత్రం షూటింగ్ ఐదు రోజులపాటు జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక పాట, ఒక ఫైట్ చిత్రీకరణ జరుపుతాం. ఆ తర్వాత హైదరాబాద్, విశాఖపట్నం, అరకు తదితర ప్రదేశాలలో షూటింగ్ చేస్తాం”అని చెప్పారు. దర్శకుడు శ్రీధన్ మాట్లాడుతూ “ప్రేమకధా చిత్రమిది. హారర్, కామెడీ అంశాలతో వైవిధ్యంగా దీనిని మలచబోతున్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News