Monday, December 23, 2024

మనాలిలో భారీ పోరాటాలు

- Advertisement -
- Advertisement -

Akhil Action Sequences for Agent in Manali

యంగ్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్. స్టైలిష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ’ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ని సూపర్‌వైజ్ చేస్తున్నారు. అఖిల్‌తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమవుతోంది.

Akhil Action Sequences for Agent in Manali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News