Wednesday, February 12, 2025

ఉప్పల్‌లో అక్కినేని అఖిల్ సందడి

- Advertisement -
- Advertisement -

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఇంటర్ జోనల్ దివ్యాంగుల టి20 క్రికెట్ టోర్నమెంట్ అభిమానులను కనువిందు చేస్తోంది. సోమవారం ఈ టోర్నమెంట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో దేశంలోని ఐదు జోన్లకు చెందిన జట్లు పోటీ పడుతున్నాయి. మంగళవారం టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి మ్యాచ్‌లను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగ క్రికెటర్లతో కలిసి సందడి చేశారు. అంతేగాక వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. దీంతో వారితో ఫొటోలు కూడా దిగారు. కాగా, మంగళవారం జరిగిన మ్యాచుల్లో వెస్ట్ జోన్, నార్త్ జోన్ జట్లు విజయం సాధించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News