Monday, December 23, 2024

‘ఏజెంట్’ నాకు చాలా స్పెషల్ మూవీ..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్‌రెడ్డి క్రేజీ స్టయిలీస్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించా రు. ఈ సినిమా విడుదల సందర్భంగా అఖిల్ విలేకరులతో మాట్లాడుతూ… ‘నాకు లార్జర్ దెన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం.

ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక కొత్త తరహా యాక్షన్ సినిమా ‘ఏజెంట్’తో స్పై మూవీ చేశా రు. ఇందులో నా పాత్ర పేరు రిక్కీ. తను చాలా వైల్డ్. ఎవరూ ఊహించని విధంగా ఉంటాడు. సినియర్ స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సాక్షి అద్భుతంగా నటించింది. ఏజెంట్’ నాకు చాలా స్పెషల్ సిని మా. నిర్మాత అనిల్ సుంకర లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఆయనతో మరో సినిమా చేస్తాను’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News