Wednesday, January 22, 2025

సోనీ లివ్ లో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ ప్రత్యేక ప్రీమియర్

- Advertisement -
- Advertisement -

గూఢచర్య థ్రిల్లర్ ప్రేమికులందరికీ గమనిక! సోనీ లివ్ సగర్వంగా అఖిల్ అక్కినేని ఏజెంట్ ప్రత్యేక ప్రీమి యర్‌ను ప్రకటించినందున, ఉత్తేజపూర్వకమైన సినిమాటిక్ కోలాహలం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. థియేట్రికల్ విడుదల తర్వాత, ఈ స్పై-థ్రిల్లర్ మీ స్క్రీన్‌లను మరోసారి జ్వలింపజేయడానికి తిరిగి వస్తోంది 2023 సెప్టెంబర్ 29 నుండి సోనీ లివ్ లో మాత్రమే. ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన, ఏజెంట్ చిత్రం అంతా కూడా రికీ చుట్టూ తిరుగుతుంది. ఆయన ది డెవిల్ అని కూడా పిలువబడే రా (RAW) చీఫ్ కల్నల్ మహదేవ్ చేత సవాలుతో కూడిన మిషన్‌ను కేటాయించబడిన ఔత్సాహిక రా ఏజెంట్. భారతదేశాన్ని నాశనం చేయడా నికి ఒక క్రూరమైన ప్రణాళికను కలిగి ఉన్న రా మాజీ ఏజెంట్, ధర్మ అలియాస్ ది గాడ్‌ని పట్టుకోవడానికి రికీ ఓ బిగినర్ గా చొరబడాలి. కానీ ఈ మిషన్ ఊహించని మలుపు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది?.

అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ వంటి తారా గణంతో ఏజెంట్ సినిమా రూపుదిద్దుకుంది. పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌ లు ఇందులో ఉన్నాయి. దర్శకత్వం వహించడంతో పాటు, ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే సురేందర్ రెడ్డి రాశారు. దీనికి కథను ప్రముఖ రచయిత వక్కం తం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి దీనిని నిర్మించారు.

ఏజెంట్ పల్స్-పౌండింగ్ ఉత్సాహాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి, 29 సెప్టెంబర్ నుండి సోనీ లివ్లో మాత్రమే ప్రసారం అవుతుంది!

దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “ఏజెంట్‌తో, మేం పట్టు సడలని కథనం, శక్తివంతమైన యాక్షన్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌ లను మిళితం చే సి లీనమయ్యే సినిమాటిక్ అనుభవాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఉత్తేజపూరిత ప్రయా ణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర ఔత్సాహికులను నేరుగా స్క్రీన్‌ల వద్దకు తీసుకురావడానికి సోనీ లివ్ తో భాగస్వామి అయినందుకు మేం సంతోషిస్తున్నాం. కొన్ని ట్విస్ట్‌ లు, సస్పెన్స్‌ ల కోసం సిద్ధంగా ఉం డండి!” అని అన్నారు.

అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘ఏజెంట్‌లో రికీ పాత్రను పోషించడం నాకు పరివర్తన కలిగించే అనుభవం. ఈ చలనచిత్రం భారీస్థాయి యాక్షన్, మనసుకు హత్తుకునే మలుపులు, అన్నింటినీ కలిగి ఉంది. ఆకర్షణీయమైన కథనం మీకు మరింత కావాలనే కోరికను కలిగిస్తుంది. సినిమా అంతటా కనిపించే మిస్టరీ అంశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతారని నమ్ముతున్నాను. సోనీ లివ్ లో ఏజెంట్ OTT ప్రీమియర్ కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, వీక్షకులు తమ ఇళ్లలో నుండి దీన్ని ఆస్వాదించవచ్చు’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News