Wednesday, January 22, 2025

త్వరలో ‘ఏజెంట్’మ్యూజికల్ బ్లాస్ట్

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ కూడా క్యూరీయాసిటీని పెంచింది. ఈ రోజు మహాశివరాత్రి శుభాక్షాంక్షలు తెలుపుతూ త్వరలోనే ఏజెంట్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

చార్ట్ బస్టర్ కంపోజర్స్ హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించిన ఏజెంట్ ఎక్స్ టార్డినరీ సాంగ్స్ ని గ్రాండ్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఏజెంట్ బ్రాండ్ న్యూ పోస్టర్ లో అఖిల్ టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ సినిమా కోసం స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు అఖిల్. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని యూనిక్ స్పై థ్రిల్లర్‌ గా రూపొందించారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమరామెన్ గా పని చేస్తుండగా, హిప్ హాప్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News