Monday, January 20, 2025

అబిడ్స్‌లో వ్యభిచారం ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అబిడ్స్ పోలీసులు పట్టుకున్నారు. 16మంది యువతులు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లు, 22 మొబైల్ ఫోన్లను పోలీసులు అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని రాంగనగర్‌కు చెందిన సలువడి అఖిల్ పహిల్వాన్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిందితులు కలిసి విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నగరానికి తీసుకుని వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు.

అఖిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు నిందితుడి గత చరిత్రను బయటికి తీయగా పలు ఆశ్చర్యకర విషయాలు బయటికి వచ్చాయి. నిందితుడి మొబైల్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. అఖిల్ రోజు వారికి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. పశ్చిమబెంగాల్ నుంచి 16 మంది యువతులను తీసుకుని వచ్చిన నిందితుడు ఫార్చ్యూన్ హోటల్లో ఉంచి వారితో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రూఫ్స్ ఇవ్వకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో ఉంచిన అఖిల్, 25 గదుల్లో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. సినీ ప్రముఖులకు అమ్మాయిలను సరాఫరా చేస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News