Friday, January 10, 2025

వచ్చే ఏడాది అఖిల్-జైనబ్ పెళ్లి: నాగార్జున

- Advertisement -
- Advertisement -

తన ప్రియురాలు జైనబ్ రవ్డ్జీతో ఎంగేజ్ మెంట్ చేసుకుని అక్కినేని అఖిల్ అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రహస్యంగా జరిగిన వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నాగార్జున అభిమానులతో పంచుకుంటూ చిన్న కోడలికి వెల్ కమ్ చెప్పారు. అయితే వీరి పెళ్లి.. నాగ చైతన్య-శోభితతోపాటు డిసెంబర్ 4నే జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో అఖిల్-జైనబ్ రవ్డ్జీ పెళ్లిపై నాగార్జున స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ను ఆయన ఖండించారు. తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లి వచ్చే ఏడాది చేస్తామని తెలిపారు. ‘అఖిల్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. అతనికి కాబోయే భార్య జైనబ్ మంచి అమ్మాయి. వారిద్దరూ జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకోవడం మంచి విషయం’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News