Thursday, November 14, 2024

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అత్త కిరణ్మయి పాత్ర

- Advertisement -
- Advertisement -

భార్గవ్ రామ్ కోసం వేట
సూత్రధారి బౌన్సర్ల సరఫరాదారు సిద్ధార్థ, పోలీసుల అదుపులో మరి 12 మంది

3 days Police custody end of Akhila Priya

మనతెలంగాణ/హైదరాబాద్: సంచలనం రేపిన బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో అఖిల ప్రియ అత్త కిరణ్మయి ప్రాత ఉన్నట్లు పోలీసులు తేల్చారు. పోలీసు కస్టడిలో అఖిలప్రియను విచారించిన పోలీసులు ఆమె నుంచి కీలక వివరాలు సేకరించారు. అందులో భాగంగా కేసులో భార్గవ్ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయి పాత్ర ఉన్నట్లు తేల్చారు. అపహరణ జరిగిన రోజు నిందితులు పారిపోయేంత వరకు వీరు సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా కిడ్నాప్ సమయంలో అఖిల ప్రియ ఉపయోగించిన రెండు ఫోన్లలో కీలక సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా అఖిలప్రియ ఫోన్లు ఎక్కడున్నాయి? వాటినెలా స్వాధీనం చేసుకోవాలన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ప్రవీణ్ రావు సోదురుల అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఈక్రమంలో అఖిలప్రియ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వాటిని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అఖిల ఫోన్లలో కీలక సమాచారం:  ప్రవీణ్ రావు సోదురుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిలప్రియ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో అఖిలప్రియ తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె సెల్‌ఫోన్‌తో పాటు అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలిక సెల్‌ఫోన్‌ఉపయోగించినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్‌పల్లిలోని లోధ అపార్ట్‌మెంట్ వరకు అఖిలప్రియ రెండు ఫోన్లలో మాట్లాడుకుంటూ వచ్చినట్లు పోలీసులు తేల్చారు.ఫోన్‌ను విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలుఅఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె ఉపయోగించిన రెండు సెల్‌ఫోన్లు ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఖిలప్రియ ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంటి తాళం తీసి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల అదుపులో 12 మంది నిందితులు:  బోయిన్‌పల్లి అపహరణ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌ను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్ల కోసం గాలిస్తున్నారు. అపహరణ కుట్ర గురించి వీళ్లకు ముందే తెలుసని వీళ్ల సమక్షంలో కిడ్నాపర్లతో చర్చించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్న భార్గవరామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో 12మంది కిడ్నాపర్లు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

అఖిలప్రియ అత్త కిరణ్మయి పాత్ర:

సంచలనం రేపిన బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు సోదరుల అపహరణకేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అఖిల ప్రియను విచారించిన పోలీసులు ఆమె నుంచి కీలక వివరాలు సేకరించారు. అందులో భాగంగా కేసులో భార్గవ్ రామ్ తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయి పాత్ర ఉన్నట్లు తేల్చారు. అపహరణ జరిగిన రోజు నిందితులు పారిపోయేంత వరకు వీరు సహాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్‌విఖ్యాతరెడ్డి ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఉంది.అలాగే ఈ కేసులో ఎ-3గా ఉన్న భార్గవరామ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. త్వరలోనే భార్గవ రామ్ సహా అతని తమ్ముడు చంద్రహాస్, తల్లి కిరణ్మయిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీమంత్రి అఖిల ప్రియను కస్టడీ పూర్తికావడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు అమెను గురువారం నాడు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News