- Advertisement -
లక్నో : ఉత్తరప్రదేశ్ శాసనసభా విపక్ష సమాజ్ వాది నేతగా అఖిలేశ్ యాదవ్ శనివారం ఎన్నికయ్యారు. సమాజ్ వాదీ పార్టీ శాసనసభ సమావేశం శనివారం జరిగింది. మెయిన్‌పురి లోని కర్హల్ నుంచి ఎన్నికల్లో విజయం సాధించిన అఖిలేశ్ ఇప్పుడు యూపి అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాదీ చీఫ్ నరేష్ ఉత్తమ్ ఈ ఎన్నికను ప్రకటించారు. ఈ సమావేశానికి అఖిలేశ్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్‌ను పిలవలేదు. దీనిపై నరేష్‌ను అడగ్గా సమావేశానికి కేవలం సమాజ్‌వాదీ ఎంఎల్‌ఎలను మాత్రమే పిలిచామని చెప్పారు.
- Advertisement -