Monday, December 23, 2024

శివ్‌పాల్ యాదవ్‌తో అఖిలేశ్ దంపతుల భేటీ

- Advertisement -
- Advertisement -

లక్నో: మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ గురువారం తన సతీమణి డింపుల్ యాదవ్‌తో కలిసి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ లోహియా(పిఎస్‌పిఎల్) అధ్యక్షుడు శివ్‌పాల్ సింగ్ యాదవ్‌ను, ఆయన కుమారుడు ఆదిత్య యాదవ్‌ను కలుసుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మరణానంతరం మైన్‌పురికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ పెద్ద, చినాన్న అయిన శివ్‌పాల్ సింగ్ యాదవ్ ఆశీస్సులను అఖిలేశ్ యాదవ్ దంపతులు కోరారు. ఇదిలావుండగా శివ్‌పాల్ యాదవ్ బుధవారం తన పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, తన కోడలు డింపుల్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సహకరించాలని ఆదేశించారు. మైన్‌పురి లోక్ సభ నియోజకవర్గం లో శివ్‌పాల్ సింగ్ యాదవ్ అసెంబ్లీ నియోజకవర్గం జశ్వంత్‌నగర్ కూడా వస్తుంది. అక్కడ శివ్‌పాల్ సహకారం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం శివ్‌పాల్ యాదవ్ కూడా డింపుల్ యాదవ్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో బిజెపి నామినేట్ చేసిన రఘురాజ్ సింగ్ శాక్యకు గట్టిపోటీ తప్పదు. మైన్‌పురి ఉప ఎన్నిక డిసెంబర్ 5న జరుగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడి కానున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News