Thursday, November 14, 2024

సిఎం కెసిఆర్‌తో అఖిలేష్ భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్‌వాదీ పార్టీ జాతీ య అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం రా ష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం లో ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, జాతీ య రాజకీయాలపై వారు చర్చించినట్లు సమాచా రం. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. గతంలోనూ కెసిఆర్, అఖిలేష్ మధ్య పలు సందర్భాల్లో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల పాట్నాలో జ రిగిన విపక్షాల సమావేశం.. త్వరలో బెంగళూరు వేదికగా జరగనున్న మరో దఫా భేటీ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన అఖిలేష్ బిజెపిని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇదే లక్షంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే బిజెపి వ్యతిరేకులను కలుపుకోవాలని, విపక్షాల పోరాటంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చించేందుకు ఇక్కడకు వచ్చినట్లు అఖిలేశ్ పేర్కొన్నారు.
అఖిలేష్ యాదవ్‌కు స్వాగతం పలికిన మంత్రులు
అంతకుముందు హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేష్ యాదవ్‌కు బేగంపేట విమానాశ్రయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం అఖిలేశ్ యాదవ్.. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గాన నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇరువురు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలా చారి పాల్గొన్నారు.

 

తరువాయి 12లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News