Sunday, November 17, 2024

యూపీలో మళ్లీ పుంజుకున్న అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

లక్నో: అఖిలేశ్ యాదవ్ తాలూకు సమాజ్ వాదీ పార్టీ మళ్లీ యూపిలో పంజుకుంది. అక్కడి బిజెపి సీట్లను తగ్గించిపారేసింది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సమాజ్ వాదీ పార్టీ 33 స్థానల్లో, బిజెపి 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి స్వీప్ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకు చెప్పారు. కానీ వాస్తవిక పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి.

1973 జులై 1న జన్మించిన అఖిలేశ్ యాదవ్ ప్రతిపక్షాల ప్రచారంలో ముందున్నారు. ఆయన మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నారు. ములాయం సింగ్ స్థాపించిన సమాజ్ వాదీ పార్టీ బాధ్యతలను ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ తీసుకున్నారు. 2004లో గెలిచిన సీట్లకన్నా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ మెరుగైన సీట్లనే పొందుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News