Monday, December 23, 2024

25 న ఆగ్రాలో రాహుల్ యాత్రకు హాజరు కానున్న అఖిలేశ్

- Advertisement -
- Advertisement -

లక్నో: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేయనున్న స్థానాలకు సంబంధించి కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడంతో రెండు పార్టీల మధ్య సానుకూలత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఈనెల 25న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ చేపట్టనున్న భారత్ జోడో న్యాయయాత్రలో సమాజ్‌వాది (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొనడానికి సంసిద్ధులయ్యారు. ఈమేరకు యుపి కాంగ్రెస్ నాయకుడు దీన్ని ధ్రువీకరించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ 17 స్థానాల్లోను, మిగతా 67 స్థానాల్లో ఎస్‌పి పోటీ చేయడానికి బుధవారం అంగీకారం కుదిరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News